అనకాపల్లి: జిల్లాలో పోలీసు సిబ్బంది సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్టు అదనపు ఎస్పీ ఎల్.మోహన్ రావు తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ‘ఎస్పీ–సంపర్క్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎస్పీ–సంపర్క్ కార్యక్రమానికి 10 మంది ఫోన్ చేసి సమస్యలు చెప్పారని తెలిపారు. ప్రతీ శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సెల్ నంబర్.93469 12011కు ఫోన్‌చేసి నేరుగా వారి సమ్యలను చెప్పవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సూపరింటెండెంట్ గిరి తదితరులు పాల్గొన్నారు.


