30వ తేదీ నాటికి గృహ గణన పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

30వ తేదీ నాటికి గృహ గణన పూర్తి చేయాలి

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

తుమ్మపాల: నిర్ణయించిన గడువులోగా సెన్సస్‌ హౌస్‌ లిస్టింగ్‌ సెన్సస్‌ ఎన్యూమరేషన్‌ –2027 ప్రక్రియ శతశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌లో ఆమెతో పాటు జాయింట్‌ డైరెక్టర్‌ అఫ్‌ సెన్సస్‌ డిపార్ట్‌మెంట్‌ దయసాగర్‌ , జిల్లా సెన్సస్‌ ఇంచార్జి జోషి బుధవారం సమావేశమయ్యారు. ఇండ్ల గణన 80 శాతం పూర్తయిందని, ఈ నెల 30 నాటికి సెన్సస్‌ హౌస్‌ లిస్టింగ్‌ సెన్సస్‌ ఎన్యూమరేషన్‌ –2027 శతశాతం పూర్తి అవుతుందన్నారు. సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ గుర్తింపు నెంబర్‌ల ద్వారా ఇన్యూమరేషన్‌ ప్రక్రియ పెండింగ్‌ ఉందని, అదేవిధంగా ఈ నెల 21 నుంచి వచ్చే నెల 25 వరకూ ఇన్‌స్టిట్యూషనల్‌ హౌసెస్‌ స్పెషల్‌ సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. ఈనెల 26 నుంచి 30 వరకూ డోర్‌ లాక్డ్‌ హౌసెస్‌, ఖాళీగా గృహాల సర్వే స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టడం జరుగుతుందని జేడీ దయాసాగర్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement