డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా
ఎంపికై న త్రీటౌన్ కానిస్టేబుల్
బీచ్‌రోడ్డు: పోలీసు విధుల్లో నిత్యం బిజీగా ఉంటూనే, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్నారో కానిస్టేబుల్. నగరంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రెడ్డి భాస్కరరావు.. ఇటీవలే ఏపీపీఎస్సీ విడుదల చేసిన డిగ్రీ కళాశాల అధ్యాపకుల ఫలితాల్లో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. ఓ వైపు కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు ఆయన దూరవిద్య ద్వారా పీజీ పూర్తి చేశారు. అనంతరం డిగ్రీ కళాశాలల అధ్యాపక పోస్టులకు సన్నద్ధమయ్యారు. 2025 జూలైలో జరిగిన రాతపరీక్షకు హాజరవగా.. ఈ నెల 13న ఏపీపీఎస్సీ ప్రకటించిన తుది ఫలితాల్లో ఆయన ఎకనామిక్స్ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. భాస్కరరావును త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది అభినందించారు.


