డిజిటల్‌ సైన్‌ రద్దుతో దీక్షలు విరమించిన ఆదివాసీలు | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ సైన్‌ రద్దుతో దీక్షలు విరమించిన ఆదివాసీలు

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

రోలుగుంట: కె.అడ్డసరం, కొంతలం ఆదివాసీల సమస్య పరిష్కారానికి తహసీల్దార్‌ సెట్టి నాగమ్మ చర్యలు తీసుకున్నారు. వివాదానికి కారణమైన డిజిటల్‌ సైన్‌ను రద్దు చేశారు. దీంతో బుధవారం గిరిజనులు దీక్ష విరమించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఐలాజ్‌ కార్యదర్శి పి.ఎస్‌.అజయ్‌ కుమార్‌, ఆదివాసీల కార్యసాధన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.కల్యాణ్‌ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కె.అడ్డసరం, కొంతలం గ్రామాలకు చెందిన ఆదివాసీలు దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములపై కన్నెసి సొంతం చేసుకోవడానికి ఫోర్జరీ సంతకాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన యలమంచిలికి చెందిన చంద్రశేఖర్‌ ఒత్తిడితో తహసీల్దార్‌ కార్యాలయంలో ఒక అధికారి డిజిటల్‌ డిజటల్‌ సైను పుణరుద్ధరించారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఆదివాసీలు తమకు జరుగుతున్న అన్యాయం, నష్టానికి కారణమైన వెబ్‌ల్యాండ్‌ డిజిటల్‌ సైను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 14 న తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రీలే దీక్షలు ప్రారంభించారని చెప్పారు. అధికారులు దిగివచ్చి డిజిటల్‌సైను రద్దు చేశారని వారు తెలిపారు. దీనికి సారధ్యం వహించి, ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ అండగా ఉన్న నల్లి కళ్యాణ్‌ను అభినందించారు. సమస్య పరిస్కారానికి చర్యలు తీసుకున్న తహసీల్దార్‌కు ఆదివాసీలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement