మునగపాక : ఈ నెల 30వ తేదీన మునగపాక ఎంపీపీతో పాటు రెండు వైస్ ఎంపీపీల స్థానాలకు గాను ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో ఎం.ఉషారాణి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలో ఒక ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీల ఎన్నిక చేపడతామన్నారు. ఎన్నికల అధికారిగా డీఎల్‌డీవో మంజులావాణి వ్యవహరిస్తారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. సభ్యులు సకాలంలో హాజరై ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలన్నారు.


