ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంధన కొరత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంధన కొరత

Apr 29 2026 8:06 AM | Updated on Apr 29 2026 8:06 AM

● వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం ● బంకుల్లో ప్రజాభిప్రాయ సేకరణ

చోడవరం : కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ కొరత సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఇటీవల కొద్దిరోజులుగా పెట్రోల్‌,డీజిల్‌ కొరత అంటూ పలు బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు పెట్టడం, మరికొన్ని బంకుల్లో ఆయిల్‌ కోసం వాహదారులు భారీ క్యూలైన్లలో నిలుచొని చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి, సమన్వయకర్త గుడివాడ అమర్‌నాధ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మంగళవారం ప్రజా సర్వే నిర్వహించారు. ఆయిల్‌ కృత్రిమ కొరత కారణంగా వాహనదారులు, ఆటోడ్రైవర్లు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చోడవరం బంకుల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు నేరుగా వాహదారులతో మాట్లాడారు. ఆయిల్‌ కొరత వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆయిల్‌ కృత్రిమ కొరత ఏర్పడిందని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ చోడవరం పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, జిల్లా యూత్‌ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్‌, రైతు విభాగంగా జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రీరామ్మూర్తి, నియోజకవర్గం ఆర్యవైశ్య విభాగం అధ్యక్షుడు ఉప్పల బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు బొగ్గు శ్యామల, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు బొగ్గు చందు, మాజీ వార్డు మెంబర్లు చిటికెల నాగేష్‌, కందర్ప శంకర్‌, ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement