కోటవురట్ల : పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వచ్చిన సమాచారం మేరకు నక్కపల్లి సీఐ రామకృష్ణ ఆదేశాలతో ఎస్‌ఐ విజయ్‌కుమార్ సిబ్బందితో కలిసి గొట్టివాడ శివారున పేకాట స్థావరంపై మంగళవారం దాడి చేశారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం పక్కా సమాచారంతో దాడి చేయగా పేకాడుతూ ఐదుగురు జూదరులు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ.2,200 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. జూదాలు నిర్వహించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా జరిగితే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


