1న తెలుగు జానపద జాతర | - | Sakshi
Sakshi News home page

1న తెలుగు జానపద జాతర

Apr 29 2026 8:06 AM | Updated on Apr 29 2026 8:06 AM

ఆరిలోవ(విశాఖ): ఉత్తరాంధ్ర సంగీత జానపద కళా పీఠం ఆధ్వర్యంలో ఆరిలోవలో మే 1న తెలుగు జానపద జాతర పేరిట మేడే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కళా పీఠం నిర్వాహకులు తెలిపారు. పీఠం వ్యవస్థాపకుడు భగవాన్‌ మాస్టార్‌ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేయాల్సిన జానపద కార్యక్రమాల గురించి చర్చించారు. జానపద కళల ప్రోత్సాహంలో భాగంగా ఇప్పటి తరానికి వాటిని పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఉత్సవాలకు హాజరై ఉత్తరాంధ్ర జానపద కళలను ఆదరించాల్సిందిగా కోరారు. సమావేశంలో సభ్యులు కొరికాన మోహనరావు, పి.ఐ.బాలరాజు, మధుసూధనరావు, మూర్తి, బాబూరావు, రాజు, రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement