నిందితుడితో పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసరావు
అనకాపల్లి : పట్టణ పోలీస్ స్టేషన్‌పరిధిలో ఈ ఏడాది జనవరిలో గంజాయి కేసుల్లో అప్పటి నుంచి నేటి వరకూ తప్పించుకుని(బెంగుళూరు) తిరుగుతున్న అనకాపల్లి మండలం సుబ్రమణ్యకాలనీకి చెందిన నీలగిరి హరీష్‌ను సోమవారం ఆర్ధరాత్రి కాలనీలో అరెస్టు చేయడం జరిగిందని పట్టణ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు మంగళవారం చెప్పారు. గతంలో 5 కేజీల గంజాయిని పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి కొనుగోలు చేసి తనకు తెలిసిన గాజువాకకి చెందిన ఇద్దరు వ్యక్తులకు అక్రమంగా సరఫరా చేసినట్టు నేరాన్ని హరీష్ అంగీకరించినట్లు ఎస్‌ఐ చెప్పారు. గంజాయి విక్రయం ద్వారా రూ.43వేలు నగదు లావాదేవీలు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విదించారన్నారు.


