పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేయాలి

Apr 29 2026 8:06 AM | Updated on Apr 29 2026 8:06 AM

● జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి

అనకాపల్లి: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా పారదర్శకంగా ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి ఆదేశించారు. స్థానిక న్యూకాలనీ రోటరీ హాల్‌లో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు, ఎరువుల డీలర్లకు యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల డీలర్లు అందరూ ఎప్పటికప్పుడు రికార్డులు, ప్రదర్శన బోర్డు, ఈపాస్‌ మిషన్లను సరిచూసుకోవాలని, ఏపీఎఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. అక్రమమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీ బృందంలో కలెక్టర్‌, డీఆర్‌వో, డీఎస్‌వో, డీఏవో, పోలీసు అధికారి, కంట్రోల్‌ బోర్డు , లేబర్‌ డిపార్టుమెంట్‌, విజిలెన్స్‌ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. భూమి హెల్త్‌ కార్డు ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలన్నారు. నాణ్యతా, ధరల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement