బీసీల వర్గీకరణ మేరకు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బీసీల వర్గీకరణ మేరకు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

Apr 29 2026 8:06 AM | Updated on Apr 29 2026 8:06 AM

అనకాపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వర్గీకరణ మేరకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారిస్‌ అన్నారు. స్థానిక గాంధీనగరం సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చి 33 సంవత్సరాలు కావస్తున్న నేటి వరకు యాత కులానికి చెందిన ఏ ఒక్కరు ఎంపీపీ, జెడ్పీటీసీలు పదవులు లేవన్నారు. ఉమ్మడి రిజర్వేషన్లు ఉండడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆదిపత్య బీసీ కులాలే అందలం ఎక్కుతున్నారని, సీఎం చంద్రబాబు బీసీల్లో ఉన్న కులాల నుంచి అత్యంత వెనుకబడిన 32 కులాలను గుర్తించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. 2016లో జీవో నంబర్‌.17 జారీ చేసినప్పటికీ నేటి అమలు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి గుత్తుర్తి అప్పారావు, జిల్లా సభ్యుడు ఎర్ర రాము, న్యాయవాదులు ఓడిబోయిన రాంబాబు, కోశెట్టి కిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement