ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

Apr 29 2026 8:06 AM | Updated on Apr 29 2026 8:06 AM

● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు

● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు

ఎస్‌.రాయవరం : అడ్డురోడ్డు ప్‌లై ఓవర్‌ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ రమేష్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. లంకెలపాలెం నుంచి గుంటూరు వెళుతున్న లారీ ఫ్లైఓవర్‌ పై ఆపి టైర్లు చెక్‌ చేసుకుంటుండగా విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లే ప్రైవేటు ట్రావెల్‌ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే హైవే మొబైల్‌ వాహనం ద్వారా క్షతగాత్రులను నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 28 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్‌ఐ చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement