మధురవాడ: మధురవాడ చంద్రంపాలేనికి చెందిన మానిపిల్లి రామకృష్ణ (60) అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె హేమబిందు తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమతో ఆచారాలకు భిన్నంగా తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. మంగళవారం మధ్యాహ్నం చంద్రంపాలెం శ్మశాన వాటికలో జరిగిన తండ్రి అంత్యక్రియల్లో ఆమె స్వయంగా పాడె మోశారు. అంతిమ సంస్కారాల్లో తలకొరివి పెట్టి, కొడుకు లేని లోటును తన బాధ్యతతో తీర్చుకున్నారు. తండ్రిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి రుణం తీర్చుకునే క్రమంలో ఆమె కంటతడి పెట్టిన దృశ్యం అక్కడి వారిని సైతం కన్నీరు పెట్టించింది.


