న్యూస్‌రీల్
చుక్క చమురైనా లేక...
జిల్లాలో పలు చోట్ల నో స్టాక్ బోర్డులు
● ఆందోళనలో వాహనదారులు
● కొరత లేదంటూ అధికారులు ప్రకటన
● ఇంధన అక్రమ మళ్లింపు, బ్లాక్‌లో అమ్మే వారిపై కఠిన చర్యలంటున్న కలెక్టర్
● జిల్లాలో 169 పెట్రోల్, డీజిల్ బంక్‌లు
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
బతుకు బండికి
జాబ్ మేళా క్యాలెండర్ విడుదల
తుమ్మపాల: జాబ్‌మేళాలను నిరుద్యోగ యువత ద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జాబ్ మేళా క్యాలెండర్‌ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో నిర్వహించిన జాబ్ మేళాల్లో రాష్ట్రంలోనే మన జిల్లాలో అత్యధిక సంఖ్యలో నియామకాలు జరిగాయన్నారు. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సంవత్సరం మరింత విస్తృత స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో నిర్దిష్ట తేదీల ప్రకారం మేళాలు నిర్వహిస్తారన్నారు. ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు తదితర పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
సాక్షి, అనకాపల్లి: గంటల తరబడి ఎదురుచూపులు..అరకొరగా ఇంధనం..కనుచూపుమేర వాహనాలు క్యూలైన్లు..ఇది సోమవారం అనకాపల్లి జిల్లాలో గల పెట్రోల్ బంకులు పరిస్థితి. జిల్లావ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. రెండు రోజులుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పెట్రోల్ బంకులతో పాటు ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్‘ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని బంకుల్లో మాత్రమే పరిమితంగా స్టాక్ ఉండడంతో, అక్కడ కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఇంధన కొరత వేధించడం..రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.169 పెట్రోల్ బంకులు ఉండగా అందులో మూడొంతుల పెట్రోల్ బంకుల్లో భారీగా క్యూలైన్లు ఉన్నాయి.
జాతీయ రహదారిని అనుకుని పాయకరావుపేట నుంచి లంకెలపాలెం వరకూ ఉన్న పెట్రోల్ బంకుల్లో పరిమితి మించి డీజిల్ ఇవ్వడం లేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కూరగాయలు, బియ్యం వంటి నిత్యావసరాల రవాణా భారమైతే సామాన్యుడి బతుకు బండి కష్టమవుతుంది. దీని ప్రభావం ఇటు రైతుపై అటూ సామాన్యులపై కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తగు చర్యలు తీసుకోకుంటే సంక్షోభానికి దారితీసే అవకాశాలున్నాయి.
ఎక్కువగా డీజిల్ వినియోగం
జిల్లా అధికారిక యంత్రాంగం గణాంకాల ప్రకారం అనకాపల్లి జిల్లాలోని సుమారు 169 పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. దాదాపు 18 లక్షల లీటర్ల పెట్రోల్, 35 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నిల్వలు సాధారణ పరిస్థితుల్లో జిల్లా అవసరాలకు మరో 7 నుంచి 10 రోజులకు సరిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 2.5 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది. అదేవిధంగా రోజుకు సగటున 4.8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లా ఒక పారిశ్రామిక హబ్ కావడంతో డీజిల్ వినియోగం చాలా ఎక్కువ ఉంటుంది. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్, పరవాడ ఫార్మా సిటీలలోని జనరేటర్లు, భారీ యంత్రాలు, సరుకు రవాణా వాహనాలకు ఈ ఇంధనం ప్రాణాధారంగా మారింది. దీంతో ఎక్కువగా డీజిల్ వినియోగం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. మండలంలోని తారువలో సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వానికి ముందు చూపు లేక పోవడమే రాష్ట్రంలో ఇంధన సంక్షోభానికి కారణమని ఆయన ఆరోపించారు. మూడు రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు నరకయాతన పడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోక పోవడంతో సమస్య మరింత తీవ్రమైందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్‌ల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ప్రజలు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. అక్కడక్కడ బంక్‌లు తెరిచి ఉన్న లీటర్ పెట్రోలు, డీజిల్ కోసం మండుటెండల్లో గంటల కొద్దీ నిరీక్షణ చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పెట్రోల్ బంక్‌ల డీలర్లు, ప్రభుత్వం కుమ్మకై ్క రాష్ట్రంలో కృత్రిమంగా పెట్రో, డీజిల్ కొరత సృష్టించారని ఆయన ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో ఎక్కడా పెట్రోలు, డీజిల్ కొరత లేక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరతపై తమ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రిని సంప్రదిస్తే ఎక్కడా సరఫరాలో లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారన్నారు. అలాంటప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత ఎందుకు ఏర్పడిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతారనే ప్రచారంతో డీలర్లు స్టాక్‌ను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 70 శాతానికిపైగా బంక్‌లు నో స్టాక్ బోర్డులు పెట్టడమే చూస్తే ఇంధన సంక్షోభం ఏ స్థాయిలో ఉందని అర్ధమవుతుందన్నారు. కేంద్ర పెట్రోలియం రసాయనాల శాఖ మంత్రి మాత్రం తాము పెట్రోలు, డీజిల్ సరఫరా తగ్గించలేదని చెప్పడం చూస్తే ప్రభుత్వ కుట్ర ఉందని స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇంధన సంక్షోభంపై దృష్టి సారించి ప్రజలకు పెట్రోలు, డీజిల్ కష్టాలు తీర్చాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు.
మన రాష్ట్రంలోనే ఎందుకీ దుస్థితి ?
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం
30న బీసీ కమిషన్ రాక
మహారాణిపేట: బీసీ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈనెల 30న విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజా ప్రతినిధులు, సాధారణ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. డెడికేటెడ్ కమిషన్ ఆదేశాల మేరకు విచారణకు సంబంధించి విషయమై అవగాహన కలిగిన వ్యక్తులు వినతి పత్రాలు సమర్పించవచ్చు.
కశింకోటలో జాతీయ రహదారిను ఆనుకుని ఉన్న ఆర్‌ఈసీఎస్ ఎదుట బీపీసీఎల్ పెట్రోల్ బంకులో ఆదివారం ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం నుంచి లారీకు 25 లీటర్లు మించి ఇవ్వడం లేదు. కారుకు రూ.2 వేల వరకూ, బైక్ రూ.1000 వరకూ పెట్రోల్ పోస్తున్నారు.
అనకాపల్లి టౌన్‌లో హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పరిమితంగా ప్రెట్రోల్, డీజిల్ పోస్తున్నారు. దీంతో వాహనదారులు క్యూ కట్టారు.
పాయకరావుపేట పట్టణంలో సాయి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో పెట్రోలు ఉంది. డీజీల్ కొరత ఉంది. జాతీయ రహదారిపై నామవరం గ్రామం వద్ద గల ఇండియన్ ఆయిల్ బంక్‌లో ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. పి.ఎల్ పురం వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లోనూ ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు.
ఎస్.రాయవరం మండలంలో అడ్డురోడ్డులో పరిధిలో శ్రీనివాస పెట్రోల్ బంకు, హెచ్‌పీ పెట్రోల్ బంకులో పెట్రోలు ఉంది. డీజీల్ కొరత తీవ్రంగా ఉంది. అడ్డురోడ్డులో ఇండియన్ ఆయిల్ బంకుల్లో డీజిల్ కోసం భారీ క్యూ లైన్లు ఉన్నాయి.
నక్కపల్లి మండలంలో ఒట్టిమెట్టలో ఇండియన్ ఆయిల్‌బంకులో ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. నక్కపల్లిలో పోలీస్ వెల్ఫేర్ అసోషియేషన్ బంకులో బైక్‌కు రూ.200 పెట్రోల్, కారుకు రూ.500 డీజిల్ వరకు కొడుతున్నారు.
కోటవురట్లలో హెచ్‌పీ పెట్రోల్ బంకులో డీజిల్ కొరత ఉంది. అదే మండలంలో జల్లురు గ్రామంలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌లో డీజిల్ కొరత ఉంది.
నర్సీపట్నం పట్టణం శారదానగర్‌లో ఇండియన్ ఆయిల్ బంక్‌లోనూ, చింతపల్లి రోడ్డులో ఇండియన్ బంక్‌లో కూడా నో స్టాక్ బోర్డులు పెట్టారు.
గొలుగొండలో హెచ్‌పీ పెట్రోల్ బంకులో ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు.
చోడవరం మండలం వెంకన్నపాలెంలో పెట్రోల్ బంక్‌లో ‘నోస్టాక్’ బోర్డు పెట్టారు.
అచ్యుతాపురంలో పూడిమడక సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంకులో రూ.200 పెట్రోల్ , రూ.500 డీజిల్ మాత్రమే కొడుతున్నారు.
సబ్బవరంలో ఆరిపాకలో హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్, డీజీల్ పరిమితంగా పోస్తున్నారు. పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయి.
పారిశ్రామిక సెజ్‌లో వేధిస్తున్న ఇంధన కొరత
పెరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగం
మరికొన్ని చోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్
ఆటోవాలాలకు తప్పని డీజిల్ కష్టాలు


