తుమ్మపాల: స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రాజా వెంకటాద్రి నాయుడు అని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వార్థరహిత సేవ, దేశభక్తి, సామాజిక న్యాయం పట్ల ఆయన చూపిన కట్టుబాటు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి విశేషమని, ప్రజలలో చైతన్యం కలిగించేందుకు చేసిన ప్రయత్నాలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో సమానత్వం, ఐక్యత, నైతిక విలువలు పెంపొందించడంలో ఇలాంటి మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ సుబ్బలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


