అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

అనకాపల్లి: పట్టణంలోని గవరపాలెం అంబేడ్కర్‌ నగర్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం కన్నుపై భాగాన్ని పగలగొట్టారు. ఈ విషయం తెలుసుకుని ఆదివారం ఉదయం అంబేడ్కర్‌నగర్‌ కాలనీ, గవరపాలెం ప్రజలు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని దోషులను తక్షణమే గుర్తించి, శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

దోషులను అరెస్టు చేయాలి

అనకాపల్లి: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల సాల భరత్‌కుమార్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ నగర్‌లో విగ్రహాన్ని పరిశీలించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భరత్‌కుమార్‌ మాట్లాడుతూ గతంలో జాతీయ రహదారి ఏఎంఎల్‌కళాశాల కొత్తూరు జంక్షన్‌ వద్ద దివంగత సీఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, సీతానగరంలో దివంగత మాజీ మంత్రి గుడివాడ గురునాథరా వు విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే దుండగులు తెగబడుతూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. అంబేడ్కర్‌ విగ్రహానికి తన సొంత సొమ్ముతో మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, పోలీసు అధికారులు స్పందించి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి దండ జ్ఞానదీప్‌ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు తక్షణమే పోలీసులకు లొంగిపోవాల ని హితవుపలికారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో విగ్రహాలను ధ్వంసం చేసే దుష్ట సంస్కృతి పెరిగిందని తెలిపారు. 80వ వార్డు ఇన్‌చార్జ్‌ కె.ఎం.నాయుడు మాట్లాడుతూ అంబేడ్కర్‌నగర్‌లో ప్రజలు కులమతాలకు అతీతంగా జీవిస్తున్నారని, ఇటువంటి చర్యలకు పాల్పడడం వల్ల విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్ప డుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ 81 వార్డుఇన్‌చార్జ్‌ బి.శివ, 80వవార్డు ఎస్సీసెల్‌అధ్యక్షుడు జిగట గణేష్‌, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు దండ సిద్ధార్థ, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజు ల రమేష్‌, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమవతి, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్‌ కొణతాల మురళీకృష్ణ, నాయకులు బి.కిషోర్‌,చరణ్‌,సూరిరాజుతదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement