స్వామీజీల పర్యవేక్షణలో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

స్వామీజీల పర్యవేక్షణలో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

అయ్యప్ప ఆలయం ప్రారంభానికి, విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన స్వామీజీలు

ఏకశిల పతినెట్టంపడి

అయ్యప్పస్వామి

ఎస్‌.రాయవరం: గురజాడ జన్మస్థలం ఎస్‌.రాయవరంలో ఉత్తరాంధ్ర ఏకశిల పతినెట్టంపడి అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7.42 గంటలకు కశింకోటకు చెందిన రేజేటి శ్రీరామాచార్యులు ఆధ్వర్యంలో విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ, శమరిమలైలో మాలికాపురత్తమ్మతల్లి ఆలయ పూజారి ఎంఎన్‌ రిజ్‌కుమార్‌లు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. కరళ నుంచి మేల్‌ శాంతి తీసుకురావడానికి డాక్టర్‌ ఆదిమోహన్‌రెడ్డి స్వామి కృషి చేసి, రిజ్‌కుమార్‌ తోపాటు 10 కేరళ పంచ వాయిద్యాలు దళం సభ్యులు కూడా కేరళ నుంచి వచ్చారు.ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎస్‌.రాయవరంలో శ్రీ అయ్యప్పస్వామి ఆలయం ప్రారంభం, విగ్రహ ప్రతిష్ట చేపట్టడం అభినందనీయమన్నారు. శబరిమల మేల్‌శాంతి శ్రీ రిజికుమార్‌ ని తీసుకురావడం తన వంతు కృషి చేశానన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తూ గురుస్వామి హరనాథ్‌ సహకారం కూడా ఉందన్నారు. ఈ సందర్బంగా ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఏకశిల పతినెట్టంపడి శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నవారి పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌, నర్సీపట్నం డీఎస్పీ పోతు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి, అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం డైరెక్టర్‌ గెడ్డం బుజ్జి, మాజీ గ్రంథాలయ చైర్మన్‌ తోట నగేష్‌, మాజీ ఎంపీపీ యేజర్ల వినోధ్‌రాజు, యూజెఎఫ్‌ అధ్యక్షుడు ఎంఎన్‌ఆర్‌ వర్మ, లీడర్‌ దినపత్రిక సంపాదకుడు వి.వి రమణమూర్తి, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement