మహాలక్ష్మినాయుడుకు గురుబ్రహ్మ, సేవారత్న అవార్డులు | - | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మినాయుడుకు గురుబ్రహ్మ, సేవారత్న అవార్డులు

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

రావికమతం: మేడివాడ హైస్కూల్లో ప్రత్యేక ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న బొడ్డు మహాలక్ష్మి నాయుడు దివ్యాంగ విద్యార్థులకు చేస్తున్న సేవలను గుర్తించి మదర్‌ థెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్వహించిన గురుబ్రహ్మ ఉగాది పురస్కారం–2026, గ్లోబల్‌ ఫౌండేషన్‌ వారి సేవారత్న అవార్డులకు ఎంపికయ్యారు. మదర్‌ థెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ అవార్డుల ప్రదానోత్సవం విఽశాఖపట్నం డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించారు. మహాలక్ష్మినాయుడును ఆదివారం మదర్‌ థెరిసా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి, విజయనగరం జిల్లా రాజాం మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు శాలువాతో సత్కరించి అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. గతంలో కూడా మహాలక్ష్మినాయుడు పలు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు చేసిన సేవలను గుర్తించి మదర్‌ థెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ వారు అందించిన ఈ అవార్డులను తీసుకోవడం అనందంగా ఉందన్నారు. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, దివ్యాంగ విద్యార్థులకు మరింతగా సేవలు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. మహాలక్ష్మి నాయుడును మేడివాడ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు వంకాయల రామారావు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement