● వేటజంగాలపాలెంలో ల్యాండ్ పూలింగ్ భూముల్లో అక్రమ తవ్వకాలు
● నిర్మాణంలో ఉన్న టీడీపీ
కార్యాలయానికి గ్రావెల్ తరలింపు
ల్యాండ్ పూలింగ్ భూముల్లో చేపడుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలు
తుమ్మపాల: అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం సర్వే నంబర్ 334లోని ల్యాండ్ పూలింగ్ భూముల్లో అడ్డూఅదుపు లేకుండా గ్రావెల్ దోపిడీ సాగుతోంది. టీడీపీ నేతల అండదండలతో గ్రావెల్ మాఫియా బరితెగించి భారీ యంత్రాలతో తవ్వేసి కొత్తూరులో నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయానికి తరలించేస్తున్నారు. అనుమతులున్న క్వారీల ద్వారా తరలించే గ్రావెల్‌పై మాత్రమే సీనరేజ్ వసూలు చేయాల్సిన ఏఎంఆర్ సంస్థ సిబ్బంది అనుమతులు లేకుండా తరలిస్తున్న గ్రావెల్ టిప్పర్లకు బిల్లులు ఇస్తూ అక్రమాన్ని సక్రమం చేస్తున్నారని తెలిసింది. ల్యాండ్ పూలింగ్ భూముల్లో ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేసినప్పటికీ వాటిని బేఖాతరు చేసి మరి తవ్వకాలు చేపడుతున్నారు. స్థానికులు ఆయా శాఖల అఽధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు కనీసం స్పందించడం లేదు. గత రెండు రోజులుగా భారీ వాహ నాలతో గ్రావెల్‌ను తరలిస్తున్నా అధికార యంత్రాంగం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
28 నుంచి ఏపీ పీజీఈసెట్
మద్దిలపాలెం(విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పీజీఈసెట్–2026ను ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వర కు రెండో సెషన్ పరీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 18 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వం గుర్తించిన గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్నును మాత్రమే పరీక్ష హాలులోకి అనుమతిస్తామన్నారు. వివరాల కోసం https://cetsapsche.ap.gov.in ను సందర్శించవచ్చు.


