తాటిచెట్లపాలెం(విశాఖ): పాత ఢిల్లీ డివిజన్, షాహబాద్ మార్కండ–మోహిరి స్టేషన్‌ల మధ్య జరుగుతున్న పలు భద్రతా పనుల నిమిత్తం మే 30, 31, జూన్ 3వ తేదీల్లో అమృత్‌సర్–విశాఖపట్నం(20808) హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ మళ్లించబడిన మార్గంలో నడుస్తుందని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లో ఈ రైలు వయా అంబాలా కంటోన్మెంట్ జంక్షన్–షహరన్‌పూర్–మీరట్ సిటీ–ఘజియాబాద్– తిలక్ బ్రిడ్జి–హజరత్ నిజాముద్దీన్‌ల మీదుగా నడుస్తుంది. ఈ తేదీల్లో పానిపట్ జంక్షన్, న్యూఢిల్లీల మీ దుగా ఈ రైలు నడవదు. ఇవే పనుల నిమిత్తం జూన్ 5వ తేదీన విశాఖపట్నం–అమృత్‌సర్(20807) హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ ఆదర్శ్‌నగర్ ఢిల్లీ–ఢోలా మజ్రా పరిధిలో 80నిమిషాలుఆలస్యంగానడుస్తుందనితెలిపారు.


