స్మార్ట్‌ కిచెన్‌ పేరిట తొలగించాలని కుట్ర | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ కిచెన్‌ పేరిట తొలగించాలని కుట్ర

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

నేను చోడవరం గర్ల్‌ హైస్కూల్‌లో 23 ఏళ్లుగా పనిచేస్తున్నాను. వేతనాలు ఆలస్యమైనా వంట సరుకులు అప్పు తెచ్చి మరీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. తక్షణమే స్మార్ట్‌ కిచెన్‌ విధానం తొలగించి..మా డిమాండ్‌లను పరిష్కరించాలి. ప్రమాద బీమాతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే తమ కుటుంబాలు వీధిన పడుతున్నాం. కేంద్రీకృత వంటశాలల పేరుతో ప్రైవేట్‌ సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తే తాము రోడ్డున పడతామని, అలాంటి ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని హెచ్చరించారు.

– గూనూరు వరలక్ష్మి, మిడ్‌ డే మీల్స్‌ వంట కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు

కొత్త విధానంతో రోడ్డున పడతాం..

ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్‌ కిచెన్‌ విధానంతో జిల్లాలో చాలా మంది పేద మహిళల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇప్పటికే మా డిమాండ్‌లను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా. మాకు గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు కలగలేదు. మేము ఇచ్చిన గడువులోగా స్మార్ట్‌ కిచెన్‌ విధానాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమిస్తాం. మా డిమాండ్‌లన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలి.

– శ్రీదేవి, మిడ్‌ డే మీల్స్‌ వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షరాలు

Advertisement
 
Advertisement
Advertisement