జాతీయ రహదారి తోటాడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలపై మాట్లాడుతున్న డీఎస్పీ శ్రావణి
అనకాపల్లి : అనకాపల్లి జాతీయ రహదారి పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు. స్థానిక జాతీయ రహదారి తోటాడ జంక్షన్ తదితర ప్రాంతాలను శుక్రవారం ఆమె ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటరమణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవాణాశాఖ, జాతీయ రహదారి, పోలీస్ శాఖల అధికారులతో సమక్షంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సిగ్నిల్‌వ్యవస్థ, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, హెచ్చరక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రహదారిలో వేగాన్ని నియంత్రించేందుకు, పాదచారుల భద్రత కసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


