లీకేజీతో ఏలేరు నీరు వృథా | - | Sakshi
Sakshi News home page

లీకేజీతో ఏలేరు నీరు వృథా

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

లీకేజీ ద్వారా వృధాగా పోతున్న ఏలేరు కాలువ నీరు

నాతవరం : ఏలేరు కాలువ నీరు లీకేజీలు ద్వారా నిత్యం వృఽథాగా పోతుంది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు, పలు పరిశ్రమలతో పాటు జీవీఎంసీ ప్రజలకు తాగునీరు అందించేందుకు కాలువ ద్వారా తరలిస్తున్నారు. ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి విశాఖపట్నం వరకు 154 కిలోమీటర్ల పొడవునా ఏలేరు కాలువ ఏర్పాటు చేయగా, నాతవరం మండలంలో 13 పంచాయతీల పరిధిలో 30 కిలోమీటర్ల మేర ఏలేరు కాలువ ఉంది. రాజుపేట అగ్రహారం సమీపంలో తాండవ నదిపై ఆక్వాడెక్టు నిర్మించారు. ఇక్కడ కాలువ శిథిలం కావడంతో లీకేజీ ద్వారా నీరు వృథాగా పోతుంది. అదే విధంగా గాంధీనగరం గునుపూడి పెదగొలుగొండపేట, ఎ.శరభవరం, చినగొలుగొండపేట, మన్యపురట్ల గ్రామాల వద్ద కూడా కాలువ శిథిలం కారణంగా లీకేజీ ద్వారా నీరు వృథాగా పోతుంది. నిత్యం లీకేజీ ద్వారా నీరు ప్రవహించడంతో ఏలేరు కాలువలో నీటి ప్రవాహం తగ్గిపోతుంది, ఇప్పటికై నా అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement