చోడవరంలో సందడిగా వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

చోడవరంలో సందడిగా వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

చోడవరం: కార్యకర్తలు, నాయకులు సందడి మధ్య వైఎస్సార్‌సీపీ చోడవరం నియోజకవర్గం ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యాలయాన్ని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ప్రారంభించారు. చోడవరం పట్టణానికి అతి సమీపంలో ఈ కార్యాలయాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌ నిర్మించారు. పార్టీ కార్యాలయంతోపాటు అమర్‌నాఽథ్‌ నివాసం ఉండేందుకు సొంత ఇల్లు కూడా ఇదే ప్రదేశంలో నిర్మించుకున్నారు. ముందుగా అమర్‌నాఽథ్‌ తన కుటుంబసభ్యులతో నూతన గృహ ప్రవేశం చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నియోజవర్గ కార్యాలయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యానారాయణ, ఉమ్మడి విశాఖజిల్లా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, పార్లమెంటు సభ్యురాలు తనూజరాణి, మాజీ ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ పాల్గొని ప్రారంభించారు.

సుమారు 500 మంది ఒకే చోట సమావేశ మయ్యే విధంగా సమావేశ మందిరం, అతిఽథులకు విశ్రాంతి గదులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు అలసట తీర్చుకునేందుకు ఒక హాలుతో పాటు అన్ని హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు సమన్వయకర్తలు కె.కె.రాజు, బొడ్డేడ ప్రసాద్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లుపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, వాసుపల్లి గణేష్‌, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, కోలా గురువులు, కంబాల జోగులు, తిప్పల గురుమూర్తిరెడ్డి, శోభా హైమావతి, మళ్ల విజయప్రసాద్‌, తైనాల విజయ్‌కుమార్‌, పసుపులేటి బాలరాజు, మలసాల భరత్‌, తిప్పల దేవాన్స్‌రెడ్డి, ఈర్లె అనురాధ, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్‌, దంతులూరి దిలీప్‌కుమార్‌, పార్టీ పరిశీలకులు సతీష్‌వర్మ, ఏడువాక సత్యారావు, గండి రవికుమార్‌, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, చింతకాయల సన్యాసిపాత్రుడు, శరగడం చిన అప్పలనాయుడు, దొడ్డి కిరణ్‌, సులోచన, పి.వి. సురేష్‌, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల ప్రతినిధులు దొండా రాంబాబు, కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, గూనూరు రామచంద్రనాయుడు, పల్లా నర్సింగరావు, పందిరిశ్రీనువాసరావు, పుల్లేటి వెంకటేష్‌, దేవరపల్లి సత్య, నాగులాపల్లి రాంబాబు, చోడవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు, నాయకులు అందరూ పాల్గొంటారు.

నూతనంగా నిర్మించిన చోడవరం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న బొత్స, కన్నబాబు, అమర్‌నాఽథ్‌, బూడి, కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు

పాల్గొన్న బొత్స, కన్నబాబు, అమర్‌నాథ్‌, బూడి, ధర్మశ్రీ తదితరులు

Advertisement
 
Advertisement
Advertisement