పసుపు మద్దతు ధర పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పసుపు మద్దతు ధర పెంచాలి

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్‌

మాడుగుల: కూటమి ప్రభుత్వం పసుపునకు మద్దతు ధర పెంచాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్‌ చేశారు. శుక్రవారం తాటిపర్తి పంచాయతీ కాశీపురంలో ఉన్న పసుపు ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పరిశీలించారు. పసుపు రైతులు కష్టపడితే రెండేళ్లకు పంటకు వస్తుందని, ఐటీడీఏ పరిధిలో పసుపు ప్రాసెసింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసి గిరి పసుపు రైతులకు మద్దతు ధర కల్పించాలన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో పసుపు ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఏర్పాటు చేయక గిరి రైతులు మధ్య దళారీ వ్యవస్థ నడుమ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికై నా ఇటీడీఏ అధికారులు స్పందించి గిరి రైతులుకు మద్దతు ధరలు కల్పించి న్యాయం చేయకపోతే గిరి రైతులు నుంచి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకత వస్తుందన్నారు. పాడేరు, అరకులలో పండించే పసుపునకు దేశీయ మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉందన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి పాడేరులో పసుపు ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement