పోటీలను ప్రారంభిస్తున్న పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి, పోర్టు అధికారులు
సాక్షి, విశాఖపట్నం: అఖిల భారత మేజర్ పోర్టుల బాడీ బిల్డింగ్, వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు సాలిగ్రామపురంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి కొరాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో విశాఖపట్నంతో పాటు చైన్నె, ముంబయి, జవహర్‌లాల్ నెహ్రూ, దీన్‌దయాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుల జట్లు పాల్గొంటున్నాయి. జట్ల మార్చ్‌ఫాస్ట్, పతాకావిష్కరణ, క్రీడాకారుల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. కార్యక్రమంలో విభాగాధిపతులు, క్రీడా విభాగ సభ్యులు పాల్గొన్నారు.


