న్యూస్‌రీల్
ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు విఫలం
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వాగ్దానం గాలికి
ఆడబిడ్డ నిధి, సున్నావడ్డీ రుణాలు, నిరుద్యోగ భృతి జాడే లేదు
రోడ్డు నిర్వాసితులకూ వంచన
‘త్రిశూల్’ను ప్రారంభానికి సిద్ధం చేయండి
బాబు హామీ
వాగ్దానాల వెల్లువ...అమలులో వెక్కిరింపు
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
జన సమీకరణకు అష్టకష్టాలు
కశింకోట: జిల్లాలో రాంబిల్లి మండలంలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభకు జనసమీకరణకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. కశింకోట మండలం నుంచి సుమారు 1500 మందిని తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గతంలో నక్కపల్లి మండలంలో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు సభకు మండలం నుంచి 600 మందిని తరలించగా, ఇప్పుడు ఏకంగా 1500 మందికి తరలించాలని ఆదేశించడంతో అంతమందిని ఎలా తరలించాలని మల్లగుల్లాలు పడుతున్నారు. జనం తరలింపునకు మండలం నుంచి 30 బస్సులను కేటాయించినట్టు సమాచారం. డ్వాక్రా, ఉపాఽధి హామీ పథకం సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించి, జన సమీకరణకు సన్నాహాలు చేశారు. డ్వాక్రా సంఘాల సభ్యులు, ఉపాధి వేతనదారులు తదితరులను తరలించాలని ఆదేశించారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు సిబ్బంది ద్వారా సమాచారం అందించి, సమీకరిస్తున్నారు. జనాన్ని సమీకరించకపోతే ఎటువంటి ఇబ్బందులకు గురికావలసి వస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, అనకాపల్లి: హామీలివ్వడం... వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రసంగాలలో అలవోకగా హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం మామూలైపోయింది... 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలతో పాటు జిల్లా రైతులకు సాగు నీరు, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మాటిచ్చారు. ఆ మాటలను నమ్మిన ప్రజలను మోసం చేశారని విమర్శలు వస్తున్నాయి. రెండేళ్ల పాలన ముగిసినా చేసిందేమీ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23న రాంబిల్లిలో ఓ కొత్త ప్రాజెక్టు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న సందర్భంగా జిల్లాకు చేసిన వాగ్దానాలను ప్రజలు గుర్తు చేస్తున్నారు.
పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతం
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఊసే ఎత్తలేడం లేదు
పోలవరం ఎడమ కాలువ పనులు ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లయినా అతీగతీలేకుండా ఉంది.
తాండవ, తుమ్మపాల, గోవాడ సుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ అడ్రస్‌లేకుండా పోయింది.
నక్కపల్లి మండలం ఉద్దండపురంలో అసంపూర్తిగా ఉన్న వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అలవాటు ప్రకారం మరిచిపోయారు. ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు.
వరాహనది, తాండవ నది గ్రోయిన్లు మరమ్మతులు, మూటకాలువ, మంగవరం గ్రోయిన్, ఆవ కాలువ ఆధునికీకరణ పనులు హామీలు నీటిపై రాతలయ్యాయి.
పాయకరావుపేట, నక్కపల్లి మండాలాల పరిధి గోపాలపట్నం ఆవను ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలకు చెందిన 2,000 ఎకరాలు ముంపు బారిన పడకుండా రక్షణ గోడ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ప్రస్తావనే లేదు.
ఫిషర్‌మెన్ కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్న హామీ గాలిలో కలిసిపోయింది.
పాయకరావుపేటలో అంబేడ్కర్ ఉద్యావన పార్కు అభివృద్ధి, నర్సీపట్నంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి, అనకాపల్లి శారదానది ఒడ్డున బోట్ షికారు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్న హామీలు అతీగతీలేకుండా పోయాయి.
అనకాపల్లి– అచ్యుతాపురం రోడ్డు విస్తర్ణ నిర్వాసిత రైతులకు నగదు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.ఇప్పుడు టీడీఆర్ బాండ్లను మాత్రమే ఇస్తున్నారు. ఇటీవల హైకోర్టు కూడా టీడీఆర్ బాండ్లు కాకుండా నగుదు రూపంలోనే నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు.
2025 ఏడాది సంక్రాంతి లోగా గుంతలులేని రోడ్లను నిర్మాణం చేపడతానని అనకాపల్లి జిల్లాలో పరవాడలో వెన్నలపాలెంలో ‘మిషన్ ఫర్ పాట్ హోల్ ఫ్రీ ఇన్ ఏపీ’శంకుస్థాపన కార్యక్రమంలో హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రధానంగా నర్సీప ట్నం–భీమిలి బీఎన్ రోడ్డు గుంతలతో అత్యంత భయకరంగా ఉంది. ఆ రోడ్డు వేయలేదు.
పేదలకు రెండు సెంట్లు భూమి ఉచితంగా ఇస్తానన్న హామీ నెరవేరలేదు.
30న ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక
మునగపాక: మునగపాక ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికను ఈ నెల 30 నిర్వహించనున్నారు. ఇటీవల ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీలపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో ఆ పదవులకు ఈనెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నిక జరపాలని ఎన్నిక కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈవోకు ఉత్తర్వులు జారీ చేసింది.


