30వతేదీలోగా గ్రామీణ కమిటీలు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

30వతేదీలోగా గ్రామీణ కమిటీలు పూర్తి చేయాలి

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

వివిధ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పార్టీ పరిశీలకులతో మాట్లాడుతున్న హర్షవర్థన్‌రెడ్డి

అనకాపల్లి : వైఎస్సార్‌సీపీ గ్రామీణస్థాయి కమిటీలను ఈనెల 30వ లోపు పూర్తిచేయాలని, ఇప్పటికే 90శాతం పూర్తి చేశారని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి (ఉత్తరాంధ్ర జిల్లాల కో–ఆర్డినేషన్‌) హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ పరిధిలో వివిద నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల సూచనలు మేరకు త్వరితగతిన మిగిలిని కమిటీలను పూర్తిచేయాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలని గ్రామీణ స్థాయి నుంచి ప్రజల మనస్సులో ఉందన్నారు. సంక్షేమ పథకాల రథసారథి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్‌ పరిశీలకురాలు శోభా హైమావతి, వివిధ నియోజకవర్గల పార్టీ పరిశీలకులు కోలా గురువులు, దంతులూరి దిలీప్‌కుమార్‌, పైలా శ్రీనివాసరావు, చిక్కాల రామారావు, పిన్నమరాజు సతీష్‌వర్మ, బి.వి.సత్యవతి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌రాజా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement