జేఈఈలో మోనిష్‌ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జేఈఈలో మోనిష్‌ ప్రతిభ

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

పాయకరావుపేట : సోమవారం ప్రకటించిన జెఈఈ మెయిన్స్‌ ఫలితాలలో శ్రీ ప్రకాష్‌ విద్యార్ధి ప్రతిభ చూపినట్టు శ్రీ ప్రకాష్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వివిఎస్‌ఎస్‌ భానుమూర్తి తెలిపారు. జె.మోనిష్‌ కుమార్‌ ఆల్‌ ఇండియా ఓబీసీ కేటగిరీలో 77 వ ర్యాంకు, జనరల్‌ కేటగిరీలో 513 వ ర్యాంకు సాధించి అగ్రగామిగా నిలిచాడని, పి.పండు పిడబ్ల్యూ బిడి విభాగంలో 252వ ర్యాంకు సాధించాడని తెలిపారు. తమ కళాశాలలో ఇస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ఐఐటీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థి ఈ ప్రతిభ కనబరిచాడని ఆయన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్‌.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్‌.విజయ్‌ ప్రకాష్‌, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement