బసవేశ్వరుని చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి
తుమ్మపాల : లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారని కెఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.ఎస్ సుబ్బలక్ష్మి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం 895వ బసవేశ్వరుని జయంతి సందర్భంగా ఆమె బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగ వివక్షను వ్యతిరేకించిన అభ్యుదయ వాది మహాత్మ బసవేశ్వరుడన్నారు. హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో బసవేశ్వరుడు ఒక్కరని, ఇతనిని బసవన్న, బసవుడు, విశ్వ గురువని పిలుస్తున్నారన్నారు. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమయ్యిందని, దేవుడికి ప్రజలకు మధ్య పూజారులు అవసరం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యం అని చాటి చెప్పారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు రాశారని తెలిపారు.


