ఎస్.రాయవరం: మండలంలోని దార్లపూడి, చినగుమ్ములూరు గ్రామాల్లో వైఎస్సార్‌సీసీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పేరిచర్ల శ్రీపతిరాజు ఆదివారం ఉదయం అమెరికా నుంచి స్వగ్రామం గుడివాడ రానుండడంతో పార్టీ అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ అడ్డురోడ్డు,గుడివాడ, చినగుమ్ములూరు, దార్లపూడిలలో శుక్రవారం రాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చినగుమ్ములూరు,దార్లపూడి గ్రామాల్లో ఫ్లెక్సీలను కొందరు బేడుతో కోసివేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నాయకుడు కోరెడ్డి బాబి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.


