నాతవరం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. మండల కేంద్రం నాతవరంలో ఆదివారం జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన వారు, అనంతరం స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశమై ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలతో పాటు చంద్రబాబు ప్రభుత్వం పాలనపై చర్చించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులకు ఎవరూ భయపడవద్దని మన వెంట మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అవినితికి కుట్ర చేసిందన్న విషయాన్ని మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలకు తెలియజేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు.సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులను విస్మరించి, వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బంది పెట్టే పనిలో కూటమి నేతల ఉన్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్ర బాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అన్యాయాలపై ప్రశ్నిస్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పారు. తప్పడు కేసులకు ఎవరూ భయపడవద్దన్నారు. మన ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై బహిరంగంగా విమర్శిస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసే అభ్యర్థులను గెలిపించుకునేందుకు అంకిత భావంతో పని చేయాలన్నారు. ఈకార్యక్రమంలో బుచ్చెయ్యపేట, నాతవరం మండలా ల జెడ్పీటీసీ సభ్యులు దొండా రాంబాబు, కాపారపు అప్పలనర్స, వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు కరక అప్పలరాజు, బీసీ సెల్ జిల్లా నాయకుడు ఇట్టంశెట్టి శ్రీను, మండలాధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు, యూత్ మండల అధ్యక్షుడు బండారు నా యుడు, పార్టీ మేధావులు సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైలపోతురాజు, మహిళానాయకురాలు పోలుపర్తి రాధ, నాతవరం మాజీ సర్పంచ్ గొలగాని రాణి, హైస్కూల్ విద్యా కమిటీ మాజీ చైర్మన్ రెడ్డి వరహలబాబు, మిడతాన రాంప్రసాద్, చెక్కా జోగిరాజు, రంభా రాంబాబు, అపిరెడ్డి మహేష్, శెట్టి లచ్చబాబు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మాజీ మంత్రి అమర్‌నాథ్


