ఢిల్లీలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీరికి అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ శనివారం తన కార్యాలయంలో వర్సిటీ తరపున ఎంపికై న ఆచార్య పేటేటి ప్రేమానందం, ఆచార్య వి.సిద్ధయ్య, ఆచార్య కె.రమేష్ బాబు, ఆచార్య ఆర్.మధుసూదన్, డాక్టర్ పి.వెంకట్రావులను అభినందించారు. వీరు ఏయూ ప్రతినిధులుగా ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


