గాయపడిన యువకుడు నాగులపల్లి వెంకట మణికుమార్
రావికమతం: మండల కేంద్రం రావికమతంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం గ్రామం చందక వీధికి చెందిన నాగులపల్లి వెంకట మణికుమార్ (19) కొమిర గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామం చోడవరానికి స్కూటీపై వెళుతుండగా గుమ్మాలపాడు దాటిన తరువాత పెట్రోల్ బంక్ సమీపంలో వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో మణికుమార్ గాయపడ్డాడు. గమనించిన స్థానికులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.


