రావికమతం: భార్య బంధువులపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు.దీనిపై కొత్తకోట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రావికమతం మండలం దొండపూడి ఎస్సీ కాలనీలో దండా బికేష్, అతని భార్య తరుచూ గొడవలు పడుతుండటంతో బికేష్ అత్త సురారపు ఈశ్వరమ్మ గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఇద్దరికీ సర్దిచెప్పారు. అయితేభార్యకు మద్దతుగా వచ్చిన బంధువులు దండా దేవుడు,దేముడుమ్మపై బికేష్ అతని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి దాడి చేసి గాయపరిచారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తకోట ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.


