దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు... | - | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు...

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

ఎస్‌.రాయవరం: పెనుగొల్లు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఆమె భర్త, కుమార్తె గాయాలతో బయటపడ్డారు. ఎస్‌.రాయవరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాకకు చెందిన పి.సుజాత(37) భర్త గణేష్‌, కుమార్తెతో కలిసి బైక్‌పై ఉపమాక వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం బయలుదేరారు. పెనుగొల్లు జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. సుజాత లారీ టైరు కింద పడడంతో అక్కడిక్కడే మృతిచెందింది. గణేష్‌, కుమార్తె స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ వాహనంతో సహా పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement