పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

వ్యానులో రవాణా అవుతున్న ఎద్దులు

కోటవురట్ల: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాలివి.. చౌడువాడ సమీపంలో పోలీసులు శనివారం వాహనాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో వ్యానులో పశువులను రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. వీటిని పాడేరు నుంచి తుని మార్కెట్‌కు తరలిస్తున్నట్టు గుర్తించారు. రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని, నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న వ్యానులో 11 పశువులను తరలిస్తుండడంతో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement