నర్సీపట్నం: ఏపీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 24న ప్రవే శ పరీక్ష నిర్వహించనున్నట్టు జిల్లా కోఆర్డినేటర్, నర్సీపట్నం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. 5,6,7,8 తరగతుల్లో ప్రవేశానికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ఇంటర్, డిగ్రీలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.నిర్ణీత సమయానికి విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో నర్సీపట్నం(బాలుర), అచ్యుతాపురం(బాలికలు)లలో రెసిడెన్షియల్ పాఠశాలలున్నట్టు తెలిపారు.


