శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

● ఎస్పీ తుహిన్‌ సిన్హా

బుచ్చెయ్యపేట/రావికమతం/రోలుగుంట: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన బుచ్చెయ్యపేట, రోలుగుంట పోలీస్‌స్టేషన్లతో పా టు, రావికమతం మండలంలోని కొత్తకోట సర్కిల్‌ కార్యాలయంలోగల పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి,క్రైం రేటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రీపగలు పెట్రోలింగ్‌,గస్తీ నిర్వహించాలని, రోడ్డు భద్రత,సైబర్‌ క్రైమ్‌పై ప్రజలకు అవగా హన సూచించారు. కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయి, వాహనాలను పరిశీలించారు.పటిష్ట నిఘాతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. రౌడీ షీటర్లకు ప్రతివారం కౌన్సెలింగ్‌ ఇవ్వాలని సూచించారు. మహిళా సంరక్షణ కార్యద ర్శులు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్పీ ఎం.శ్రావణి,సీఐ కోటేశ్వరరావు, బుచ్చెయ్యపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు, కొత్తకోట ఎస్‌ఐ ఎస్‌ఐ శ్రీనివాస్‌, బుచ్చెయ్యపేట అదనపు ఎస్‌ఐ భాస్కరరావు, రోలుగుంట ఎస్‌ఐ రామకృష్ణారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement