సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

మునగపాక పీహెచ్‌సీలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో హైమావతి

మునగపాక: సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎం.హైమావతి సూచించారు. స్థానిక పీహెచ్‌సీని శుక్రవారం ఆమె సందర్శించారు. రికార్డులు పరిశీలించి, రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. 14 సంవత్సరాల బాలికలకు అందజేస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఎంతమేర వేశారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఉమ్మలాడలోని సంచార చికిత్స కార్యక్రమాన్ని పరిశీలించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సన్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా గణాంకాధికారి ఎ.రామచంద్రరావు, వైద్యాధికారులు విమలగిరి, చైతన్య రామ్‌,సీహెచ్‌వో దేవకాంత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement