అడ్డదారికి పోలీసుల అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

అడ్డదారికి పోలీసుల అడ్డుకట్ట

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

● మూడు లారీలపై కేసులు నమోదు

● మూడు లారీలపై కేసులు నమోదు

పోలీసులు పట్టుకున్న లారీలు

నక్కపల్లి: పరిమితికి మించి లోడుతో జాతీయరహదారిపై రాకపోకలు సాగిస్తూ టోల్‌ఫీజు ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో ప్రయాణిస్తున్న మూడు లారీలకు నక్కపల్లి పోలీసులు అడ్డుకట్ట వేశారు. టోల్‌ఫీజు ఎగ్గొట్టేందుకు ఉపమాక, వేంపాడు, అమలాపురం, చందనాడ, కాగిత మీదుగా జాతీయరహదారి చేరుకుని అక్కడనుంచి తునివైపు వెళుతున్న వాహనాలను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. టోల్‌ఫీజు ఎగ్గొట్టడం కోసం ఈ వాహనాలు అడ్డదారిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.ఈవాహనాల్లో చిప్స్‌,ఫ్లైయాష్‌ తదితర లోడు ఉందని ఈ మూడు లారీలను పట్టుకుని కేసులు నమోదు చేశామని అపరాధరుసుం విధించేందుకు రవాణాశాఖ అధికారులకు సిఫారసరు చేశామని ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement