ఎస్.రాయవరం: వైఎస్సార్‌సీపీ 2.0 లో యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన సిద్ధార్థరెడ్డిని పాయకరావుపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు పోచిన నరేష్ గురువారం గాజువాకలో మర్యాద పూర్వకంగా కలిశారు. రానున్న రోజుల్లో యువతకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమాలు రూపొందిస్తారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర విజయవంతానికి యువత నడుం బిగించాలని సూచించారన్నారు.


