పట్టుబడ్డ నిందితుడుతో పోలీసులు
నర్సీపట్నం: పదేళ్ల క్రితం పరారైన గంజాయి నిందితుడిని అరెస్ట్ చేశామని రూరల్ ఎస్‌ఐ పి.రాజారావు తెలిపారు. 2016లో రూరల్ పోలీసు స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో అల్లూరి జిల్లా, జి.కె.వీధి మండలం, జెర్రిలా గ్రామానికి చెందిన సయ్యద్ సినీబ్రహ్మషా ఆలియాస్ జెర్రిల శ్రీను(40) ఎ–2 నిందితుడిగా ఉన్నాడు. పదేళ్లుగా పరారీలో ఉన్నాడు. తమ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని అదుపులోకి తీసుకుని మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించిందని ఎస్‌ఐ తెలిపారు.


