రావికమతం : మండలంలో టి.అర్జాపురం గ్రామ దేవత శ్రీ దుర్గమ్మ అమ్మవారి పండగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్, మాజీ రాష్ట్ర స్పోర్ట్స్ అధారటీ (శాప్) చైర్మన్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిెడెంట్ బైరెడ్డి సిద్దార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆదీప్‌రాజ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజాన రామునాయుడు, వైస్ ఎంపీపీ భవానీప్రసాద్, రాజాన అప్పలనాయుడు, మత్సా రామునాయుడు, యిల్లపు రాము, ఎల్లపు ఎర్రినాయుడు, మరిశా రమణ, మత్సా అర్జున్, చిరంజీవి, రమణ తదితరులు అమర్‌నాఽథ్‌కు, బైరెడ్డి సిద్దార్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ పైల రాజు, మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కంచిపాటి జగ్గారావు, సీనియర్ నాయకులు మహాలక్ష్మినాయడు, తలారి అదిమూర్తి, మాజీ జెడ్ప్‌టీసీ ఆసరి వాస్ గోవింద్, గుమ్ముడు సత్యదేవ, గుమ్మాలపాడు సర్పంచ్ బంటు సన్యాసినాయుడు, ఎంపీటీసీలు రమణబాబు, పూడి దేవా, నాయకులు గట్డ్రెడ్డి తాతబాబు, కొత్తకోట ఉప సర్పంచ్ పందల దేవా, మండల వైఎస్సార్‌సీపీ యూత్ అధ్యక్షుడు చిరంజీవి, సోషల్ మీడియా ఇన్‌ఛార్జి వెల్లంకి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రికి పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు.


