అరకులోయ టౌన్: నియోజకవర్గ పరిధిలో డిజిటలైజేషన్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, అతి త్వరగా పూర్తి చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో అరకులోయ నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు, సభ్యులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కొనసాగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను, వెరిఫికేషన్‌ను తగు జాగ్రత్తలు పాటిస్తూ సక్రమంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఎంపిక చేసిన వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల ఫొటోలు, ఇతర పూర్తి వివరాలను సోషల్ మీడియా ప్రతినిధులకు వెంటనే అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తకు ఐడీ కార్డులు జారీ చేస్తారని, అలాగే వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారని వెల్లడించారు. పంచాయతీ స్థాయి వివరాల సేకరణలో ఏవైనా సందేహాలు ఉంటే 9381558327, 9347094001 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ కొర్రా రామ్, అరకులోయ, డుంబ్రిగుడ యువజన విభాగం అధ్యక్షులు బోయి కిరణ్ కుమార్, కమ్మిడి విజయదశమి పాల్గొన్నారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్రతినిధులు పాంగి నర్సింగరావు, సెంబి సుందర్‌రావు, జన్ని అర్జున్, వంతాల నాగేశ్వరరావు, పాంగి అజయ్ తదితరులు హాజరయ్యారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


