నక్కపల్లి : వైఎస్సార్‌సీపీ నక్కపల్లి మండల శాఖ అధ్యక్షుడిగా సీతంపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ, సీనియర్ నాయకుడు గొర్ల గోవిందరావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నక్కపల్లి మండల నూతన కమిటీతో పాటు, పలువురిని రాష్ట్ర, జిల్లా బీసీ విభాగంలో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మండల శాఖ అధ్యక్షుడిగా గొర్ల గోవిందు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా దేవవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గొర్ల నర్సింహమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ విభాగం కార్యదర్శిగా బుచ్చిరాజుపేటకు చెందిన గొర్ల బాబూరావు, పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు లోడగల చంద్రరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ కార్యదర్శిగా బొడ్డపాటి అనిల్‌కుమార్, వలంటీర్ల విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సుర్ల వరలక్ష్మి నియమితుల య్యారు. ఇక నక్కపల్లి పార్టీ మండల ఉపాధ్యక్షులుగా సాదిరెడ్డి శ్రీనివాస్, జుల్లూరి లక్ష్మిపతిరాజు, ప్రధాన కార్యదర్సులుగా అల్లురమణ, కొల్నాటి దుర్గాప్రసాద్, ఎరిపల్లి నాగేశు, దమ్ము అప్పారావు, కార్యదర్శులుగా గంటా తిరుపతిరావు, గొర్ల రమణ, అనపర్తి పాండు, కొవిరి కొండబాబు, పక్కుర్తి రమణ, కార్యవర్గ సభ్యులుగా కొర్రా శ్రీనివాసరావు, వీరారెడ్డి రమేష్, వీదికన్నారావు, యలమంచిలి అప్పలరాజు, యజ్జల అప్పలరాజు, మేరుగ చిన గంగరాజు, కోడ లక్ష్మణ్, కండెల్ల బాబ్జి, అల్లుబోయిన గోవిందు, మహ్మద్ హుస్సేన్, కోశెట్టి గోవిందు, కర్రి రాముడు, రావి ఈశ్వరరావు, కురందాసు నానాజీ, కురందాసు గోవిందు, దుంగల కృష్ణారావు, చుక్కల హరి, కోమర్తి చిట్టిబాబు, సఖిరెడ్డి వెంకటరమణ నియమితులయ్యారు.


