మహారాణిపేట: కేజీహెచ్ ఎస్టీ సెల్‌లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని యథావిధిగా కొనసాగించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె. సుభద్ర కోరడంతో వారి బదిలీలు నిలిచిపోయాయి. ఇటీవల ఈ నలుగురు సిబ్బందిని ఆకస్మికంగా బదిలీ చేయగా, దీనివల్ల కేజీహెచ్‌కు వచ్చే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. అప్పలరాజు, కార్యదర్శి కటారి శోభన్ కుమార్ గురువారం చైర్‌పర్సన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివాసీ ప్రాంతాల నుండి వైద్య సేవల కోసం వచ్చే అమాయక ప్రజలకు ఈ సిబ్బంది ఎంతో చేదోడువాదోడుగా ఉంటారని వారు వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన చైర్‌పర్సన్ సుభద్ర, ఏఎస్‌ఆర్ కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే ఈ నలుగురు సిబ్బందిని అక్కడే కొనసాగించడం అత్యవసరమని ఆమె కోరారు. చైర్‌పర్సన్ విజ్ఞప్తి మేరకు ఆ నలుగురు ఉద్యోగులను తిరిగి కేజీహెచ్‌లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం నాయకులు అప్పలరాజు, శోభన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌కు, ఏఎస్‌ఆర్ కలెక్టర్‌కు, ఇతర అధికారులకు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


