● టీటీడీ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్‌సీపీ నాయకుల నిరసన
● వెంకన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు
● భారీగా హాజరైన పార్టీ శ్రేణులు
అసాంఘిక, అనైతిక చర్యలకు పాల్పడి తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీసిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించి, తిరుమల పవిత్రను కాపాడాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు.
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బిఆర్.నాయుడును విధుల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి దేమునిగుమ్మం వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, మాడుగుల వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం, మన్యం జిల్లాల రీజనల్‌కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్ సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ, చోడవరం వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త గుడివాడ అమర్‌నాఽథ్,ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాలజోగులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తదితరులు, నర్సీపట్నంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం సమన్వయ కర్త ఉమాశంకర్ గణేష్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
– సాక్షి నెటవర్క్
రాంబిల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొడుతున్న వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ నాయకులు
బీఆర్ నాయుడిని తొలగించాలంటూ ప్లకార్డులతో ఉపమాకలో నిరసన వ్యక్తం చేస్తున్న పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు
పార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే, నర్సీపట్నం సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్


