మునగపాక: స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉమ్మలాడ ఎంపీటీసీ మొల్లేటి కృష్ణవేణి ఎన్నికయ్యారు. ఇటీవల ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, వైస్ ఎంపీపీలు బోజా లక్ష్మితో పాటు చిందాడ దేవీలపై వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించడంతో అప్పటి ఆర్‌డీవో ఆయీషా సమక్షంలో అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో నూతన ఎంపీపీ ఎన్నికను శనివారం తన కార్యాలయంలో ఎంపీడీవో ఉషారాణి నిర్వహించారు. ఎంపీపీగా ఉమ్మలాడ ఎంపీటీసీ మొల్లేటి కృష్ణవేణి పేరును మునగపాక ఎంపీటీసీ–2 సూరిశెట్టి రమణ ప్రతిపాదించగా ఇతర వైఎస్సార్‌సీపీ సభ్యులు బలపరిచారు. సమావేశానికి మొత్తం 13 మంది సభ్యులు హాజరుకాగా వారిలో 11 మంది కృష్ణవేణికి అనుకూలం, మరో ఇద్దరు సభ్యులు వ్యతిరేకం ప్రకటించినట్టు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీగా ఎంపికై న కృష్ణవేణి నారాయణరావు దంపతులను ఇతర ఎంపీటీసీలంతా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ,ఎంపీటీసీలు సూరిశెట్టి రమణ,బోడకుర్తి గణేష్, మద్దాల వీరునాయుడు,కాండ్రేగుల కిరణ్‌కుమార్,మళ్ల కాశీ సురేష్, ఇల్లా శిరీషా, కాండ్రేగుల వెంకటలక్ష్మి, బొడ్డేడ హైమావతి, కర్రి సంజీవి,శరగడం అప్పలనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.


