నర్సీపట్నం: నియోజకవర్గ కేంద్రం నర్సీపట్నంలో జరిగిన మరిడమ్మ పండగలో డప్పు కళాకారుడైన దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేయడం దుర్మార్గమని, తక్షణమే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. దళితుడుపై దాడిని నిరసిస్తూ పార్టీ నాయకులతో కలిసి ఆయన స్థానిక అబిద్‌సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి శనివారం క్షీరాభిషేకం చేసి, స్పీకర్ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో కొట్టడం మరీ దుర్మార్గమన్నారు. స్పీకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. కాలు తొక్కడం వల్లే స్పీకర్ కొట్టారని బాధితుడితో బలవంతంగా వీడియో రిలీజ్ చేయించారన్నారు. కాలు తొక్కితే కొట్టేస్తారా అని గణేష్ ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ చట్టాలను గౌర వించాల్సిన స్పీకర్ ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, సహాయ కార్యదర్శి పెట్ల అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి,జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు,మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్‌లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సర్వం, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు ఈరెల్లి సుదీర్‌కుమార్, పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత, గొలుగొండ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ రోజా, 17వ వార్డు ఇన్‌చార్జి అల్లంపల్లి లావణ్య, పార్టీ టౌన్ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావు, మట్ల చంటి, పట్టణ మహిళా అధ్యక్షురాలు కణితి అన్నపూర్ణ, ముస్లిం కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ షేక్ ఉన్నీషాబేగం, మాజీ కౌన్సిలర్లు జగదీశ్వరి, కర్రి చైతన్య, సుర్ల నాయుడు, తమరాన శ్రీను, కొణతాల వరలక్ష్మి పాల్గొన్నారు.


